చూపు, రూపు, మాట ,మతి లేని వాడు కాడు వికలాంగుడు
నిజమైన వికలాంగుడు వీడు చెప్తున్నాను జాగ్రత్తగా చూడు
మానవత్వం లేనివాడు దయ చూపని వాడు కళ్ళున్న అంధుడు
సాటి మనిషిని ప్రేమించలేని వాడు ప్రేమను పంచని వాడు చేతులున్న అవటివాడు
సాటి మనిషి బాధ విననని వాడు పట్టించుకోని వాడు చేవ్వులున్న చెవిటి వాడు
సాటి మనిషికి జరుగుతున్న అన్యాయాన్ని ఎదురు మాట్లాడని వాడు మాటలు వచ్చిన మూగవాడు
సాటి మనిషి కోసం ఆలోచించని వాడు స్వార్థంతో మతిబ్రమించినవాడు
మనస్సు లేని వాడు మనిషిని మనిషిగా చూడని వాడు అసలు మనిషేకాడు
చూపు లేని వాడు కళ్ళు లేవని బాధపడడు దారి చూపేవాడు ఉన్నాడని
నడవలేని వాడు కాళ్ళు లేవని జీవన ప్రయాణం ఆపడు నడిపించేవాడు ఉన్నాడని
మాటలు రానివాడు మౌనంగా ఉండడు తనను అర్థం చేసుకునేవాడు ఉన్నాడని
మతిస్తిమితం లేనివాడు తనకోసం ఆలోచించడు తనను పట్టిచించుకునే వాడు ఉన్నాడని
వారి సంకల్పమే వారి ధైర్యం వారి ధైర్యమే వారి నమ్మకం అదే వారి ఆత్మస్త్యర్యం
ఆ నమ్మకమే మనం ఈ సమాజం వారికి చెయ్యి అందిస్తామని సహాయం చేస్తామని
ఆ నమ్మకాన్ని మనం అవహేళన చెయ్యదు చెయ్యి అందిస్తాం సహాయపడదాం
"మానవ సేవే మాధవ సేవ" మనం ఒకరికిఒకరం సేవకులు అవుదాం అది చూసి గర్వించాలి మనల్ని పుట్టించినవాడు ఆ దేవుడు
Written By,
Siva..
Siva..
No comments:
Post a Comment