Hi, Welcome to Siva's Poetry, HAPPY NEW YEAR TO U ALL."LOVE THE WORK U DO AND DO THE WORK U LOVE". Thanks for Staying With Us.Have A Nice Day :)

Saturday, December 18, 2010

మాతృదేవోభవ

అమ్మ నీ నామం ఎంతో మధురం అమ్మ అని పిలిచిన పలుకే బంగారం
అమ్మ కనిపించే దైవం మనకు దైవ సమానం పూజించాలి ప్రతిదినం తలుచుకోవాలి ప్రతిక్షణం
మన జననం అమ్మకు ప్రాణశంకటం  పునఃర్జన్మం కానీ లెక్క చేయదు ప్రాణానైనా త్యాగం చెయ్యడం అదే అమ్మ గొప్పతనం
మనం వేసే ప్రతి అడుగు, మనం గడిపే ప్రతిక్షణం, మనం సాదించే ప్రతి విజయం దాని వెనుక ఉన్న రహస్యం అమ్మ మనకు తోడుఉండడం
మన ఆనందమే తన సంతోషంగా మన దుఃఖమే తన బాధగా మన
భవిష్యత్తే తన లక్ష్యంగా మన పుట్టుక  నుండి తన మరణం దాక మన ఆలనాపాలనా చూసుకునేదే అమ్మ
అమ్మ ప్రేమను కొలవడానికి లేదు ఏ  కొలమానం ఎవరితో పోల్చలేని గొప్ప అద్భుతం
అమ్మ మనకు పంచిన ప్రేమలో ఒక్క శాతం మనం ఆమెకు అందిస్తే అదే అమ్మకి గొప్ప ఆనందం
అమ్మకి కలుగుతుంది దుఃఖం మనం తన ప్రేమను అర్థం చేసుకోని క్షణం
ఏడుస్తుంది తన నిర్మల హృదయం
అమ్మ రుణం తీర్చుకోడం ఎవరితరం అటువంటి మన భవిష్యత్ నిర్మాత భవిష్యత్తును చెయ్యదు ప్రశ్నార్థకం
అమ్మ నాన్న కలయికే మనం వాళ్ళని కలిపి చూసుకోవడమే మనకు క్షేమం వాళ్ళను విడదీయడం పెద్ద నేరం
అమ్మను ప్రేమించలేనివాడు ఎవరిని ప్రేమించలేడు అమ్మని ప్రేమించేవారిని అందరు ప్రేమిస్తారు
అమ్మ గొప్పతనం చెప్పడానికి సరిపోదు నా జీవితం అమ్మే నా ప్రాణం, అమ్మ లేని లోకం శూన్యం కాపాడుకుందాం అనుక్షణం ,ప్రతి అమ్మకు నా ఈ కవిత అంకితం. 


A - Annivella
M - Manaku
M - Mamakaram
A - Andinchedi


Written By,
Siva..

Sunday, November 28, 2010

అదినువ్వే నా నేస్తం

అనుకున్నాను  ఈ నేలపైకి ఒక్కడిగా వస్తామని ఒక్కడిగానే ఈ నెలలో కలిసిపోతామని  జీవితం అంటే ఇంతేనని
అనుకోలేదు మద్యలో అనురాగాలు ఆప్యాయతలు అభిమానాలు ఉంటాయని దానికి ప్రతిబింబం స్నేహమని

అనుకున్నాను ప్రపంచంలో వెతికితే దొరకని వస్తువు  ఏది ఉండదని
అనుకోలేదు నేను వెతికాక దొరికిన ఆ అపురూపమైన వస్తువే స్నేహమని, నాకు మరోప్రపంచం చూపిస్తుందని

అనుకున్నాను అమ్మ-నాన్న, అక్క-చెల్లి , అన్న-తమ్ముడు, మన రక్త సంబందమని మనకోసం ఏమైన చేస్తారని
అనుకోలేదు  మనకు ప్రేమను పంచి ప్రాణలను సైతం  అర్పించే ఇంకో బంధం ఉందని అది స్నేహమని

అనుకున్నాను మన లోని భావాలను, సుఖ దుఖాలను, ప్రేమానురాగాలను పంచుకోవడానికి ఒక సాధనం కావాలని
అనుకోలేదు ఆ సాధనం స్నేహమని  ఆ స్నేహంతో ఏమైనా పంచుకోవచ్చని ఎంత  పంచుకున్న ఇంకా చెప్పుకోవడానికి కొంచం ఉంటుందని

అనుకున్నాను మనం ఎంచుకునే ప్రతి మార్గంలో మంచి చెడులు ఉంటాయని వేసే ప్రతి ఆడుగు ఆచి తూచి వెయ్యాలని
అనుకోలేదు స్నేహంతో కలిసి వేసే ప్రతి అడుగు చివరికి మంచి మార్గానికే తీసుకొని వెళ్తుందని ఎందుకంటే స్నేహం అంటేనే నమ్మకమని

అనుకున్నాను ఒక విత్తనం నాటి నీరు పోసి పెంచితే అది ఒక వృక్షంమై మనకు నీడను ఇస్తుందని
అనుకోలేదు పరిచయం అనే విత్తనానికి అభిమానమే నీరు పోసి పంచితే స్నేహమనే మహా వృక్షంమై మనకు జీవితాంతం తోడు నీడగా ఉంటుందని

అనుకున్నాను ఒక దీపం ప్రపంచానికి వెలుగును  ఇవ్వలేదని కాని  ఆ దీపంతో కొన్ని వేల దీపాలను వెలిగిస్తే ప్రపంచం వెలుగుమయం అవుతుందని
అనుకోలేదు  స్నేహమనే దీపంతో   మనిషి లోని మంచి మనసును ప్రేమతో వెలిగిస్తే  ప్రపంచం స్నేహమయం అవుతుందని

అనుకున్నాను కూడు గుడ్డ ఇల్లు మన జీవనానికి అవసరమని వాటిని సంపాదించుకోవడమే మన జీవితానికి అర్థమని
అనుకోలేదు ఆ మూడింటి సంపాదించుకోవడం సులభమని కాని  ఒక మంచి స్నేహితుడిని సంపాదించుకోకుంటే ఆ జీవితం వ్యర్థమని 

అనుకున్నాను  మనిషికి జబ్బు చేస్తే వైద్యుడు ఇచ్చే ఔషదం నయం చేస్తుందని బాధను తగిస్తుందని
 అనుకోలేదు  మనసుకి   జబ్బు  చేస్తే  స్నేహితుడే వైద్యుడని స్నేహమే ఔషదం అని దాని తోడే బలమని  ఓధార్పు ఇస్తుందని.

అనుకున్నాను దేవుడిని ప్రార్ధిస్తే మన కష్టాలను దూరం చేసి ధైర్యాన్ని ఇచ్చి వరాలు ప్రసాదిస్తాడని
అనుకోలేదు మనం ప్రార్ధించాకుండానే మన  కష్టాలలో ఆదుకొని ధైర్యాన్ని ఇచ్చేది స్నేహమని ఆ దేవుడు మనకు ఇచ్చిన గొప్ప వరమని

అనుకున్నాను అదృష్టం తలుపు తట్టి వస్తుందని మనం మెలుకువలో ఉండి ఆహ్వానిస్తే  మన జీవితాన్నే మార్చేస్తుందని
అనుకోలేదు మన  గుండె తలుపును తీసి స్నేహాన్ని ఆహ్వానిస్తే  మన జీవితం ఆనందమయమని మంచి స్నేహితుడు  లబించడమే మనకు గొప్ప అదృష్టమని

అనుకున్నాను ఇన్ని ప్రత్యేకతలు ఉన్న ఆ స్నేహంతో స్నేహం చెయ్యాలని నా స్నేహం ఎవరితో అని
అనుకోలేదు నన్ను వరించిన అదృష్టం, నా బలం, ఆ దేవుని వరం,  నా ఆనందం, నా  స్నేహానికి ప్రతిరూపం అదినువ్వే రా నా నేస్తం 
Written By,
Siva..

Thursday, July 29, 2010

అమ్మాయిలు

గడుసరి సొగసరి చూడచక్కని పుత్తడిబొమ్మ లాంటి  ఓ అమ్మాయిలు
మీ నవ్వు వికసించిన పువ్వులు వినసొంపైన సంగీత రాగల ధ్వనులు
మీ అందం అపురూపం పొగడడం ఎవరితరం దానిని ప్రశంసించి ఎందరో అయ్యారు ప్రముక కవులు
మీ వల్లే పుట్టాయి మనకు పురాణ ఇతిహాసాలు
మీ కోసం జరిగాయి ప్రపంచ యుద్ధాలు
మీ ప్రేమకోసం తపించి ప్రేమించి ఎందరో చరిత్రలో నిలిచారు అయ్యారు గొప్ప ప్రేమికులు
అమ్మలా లాలించి ప్రేయసిలా ప్రేమించి భార్యగా సేవలు చేసి అందరి గుండెలో అయ్యారు ఆరాధ్య దేవతలు
మీ మీద ఆధారిపడి ఉంటుంది ఒక కుటుంభం ఒక దేశం యొక్క కీర్తిప్రతిష్టలు
మీరు కాదు అంగడిలో ఆట బొమ్మలు రేపటి తరాన్ని నిర్మించే నిర్మాతలు వాళ్ళ భవిష్యతును వెలిగించే దీపాలు
మీరు అన్నం పెట్టడంలో అన్నపూర్ణలు దండించడంలో ఆదిపరాశక్తులు
ఇన్ని తెలిసిన మీరు  చేసుకోకండి  మీ  జీవితం నవ్వులపాలు  ఎప్పటికి  అవ్వాలి బంగారు బాటలు ఇదే మా విన్నపాలు
మీరు లేని సృష్టికి ఉండవు రూపురేకలు కానీ మిమ్మల్ని అర్థంచేసుకోవడమే అందరికి పెద్ద సవాలు...........

Written By,
Siva..