Hi, Welcome to Siva's Poetry, HAPPY NEW YEAR TO U ALL."LOVE THE WORK U DO AND DO THE WORK U LOVE". Thanks for Staying With Us.Have A Nice Day :)

Sunday, November 28, 2010

అదినువ్వే నా నేస్తం

అనుకున్నాను  ఈ నేలపైకి ఒక్కడిగా వస్తామని ఒక్కడిగానే ఈ నెలలో కలిసిపోతామని  జీవితం అంటే ఇంతేనని
అనుకోలేదు మద్యలో అనురాగాలు ఆప్యాయతలు అభిమానాలు ఉంటాయని దానికి ప్రతిబింబం స్నేహమని

అనుకున్నాను ప్రపంచంలో వెతికితే దొరకని వస్తువు  ఏది ఉండదని
అనుకోలేదు నేను వెతికాక దొరికిన ఆ అపురూపమైన వస్తువే స్నేహమని, నాకు మరోప్రపంచం చూపిస్తుందని

అనుకున్నాను అమ్మ-నాన్న, అక్క-చెల్లి , అన్న-తమ్ముడు, మన రక్త సంబందమని మనకోసం ఏమైన చేస్తారని
అనుకోలేదు  మనకు ప్రేమను పంచి ప్రాణలను సైతం  అర్పించే ఇంకో బంధం ఉందని అది స్నేహమని

అనుకున్నాను మన లోని భావాలను, సుఖ దుఖాలను, ప్రేమానురాగాలను పంచుకోవడానికి ఒక సాధనం కావాలని
అనుకోలేదు ఆ సాధనం స్నేహమని  ఆ స్నేహంతో ఏమైనా పంచుకోవచ్చని ఎంత  పంచుకున్న ఇంకా చెప్పుకోవడానికి కొంచం ఉంటుందని

అనుకున్నాను మనం ఎంచుకునే ప్రతి మార్గంలో మంచి చెడులు ఉంటాయని వేసే ప్రతి ఆడుగు ఆచి తూచి వెయ్యాలని
అనుకోలేదు స్నేహంతో కలిసి వేసే ప్రతి అడుగు చివరికి మంచి మార్గానికే తీసుకొని వెళ్తుందని ఎందుకంటే స్నేహం అంటేనే నమ్మకమని

అనుకున్నాను ఒక విత్తనం నాటి నీరు పోసి పెంచితే అది ఒక వృక్షంమై మనకు నీడను ఇస్తుందని
అనుకోలేదు పరిచయం అనే విత్తనానికి అభిమానమే నీరు పోసి పంచితే స్నేహమనే మహా వృక్షంమై మనకు జీవితాంతం తోడు నీడగా ఉంటుందని

అనుకున్నాను ఒక దీపం ప్రపంచానికి వెలుగును  ఇవ్వలేదని కాని  ఆ దీపంతో కొన్ని వేల దీపాలను వెలిగిస్తే ప్రపంచం వెలుగుమయం అవుతుందని
అనుకోలేదు  స్నేహమనే దీపంతో   మనిషి లోని మంచి మనసును ప్రేమతో వెలిగిస్తే  ప్రపంచం స్నేహమయం అవుతుందని

అనుకున్నాను కూడు గుడ్డ ఇల్లు మన జీవనానికి అవసరమని వాటిని సంపాదించుకోవడమే మన జీవితానికి అర్థమని
అనుకోలేదు ఆ మూడింటి సంపాదించుకోవడం సులభమని కాని  ఒక మంచి స్నేహితుడిని సంపాదించుకోకుంటే ఆ జీవితం వ్యర్థమని 

అనుకున్నాను  మనిషికి జబ్బు చేస్తే వైద్యుడు ఇచ్చే ఔషదం నయం చేస్తుందని బాధను తగిస్తుందని
 అనుకోలేదు  మనసుకి   జబ్బు  చేస్తే  స్నేహితుడే వైద్యుడని స్నేహమే ఔషదం అని దాని తోడే బలమని  ఓధార్పు ఇస్తుందని.

అనుకున్నాను దేవుడిని ప్రార్ధిస్తే మన కష్టాలను దూరం చేసి ధైర్యాన్ని ఇచ్చి వరాలు ప్రసాదిస్తాడని
అనుకోలేదు మనం ప్రార్ధించాకుండానే మన  కష్టాలలో ఆదుకొని ధైర్యాన్ని ఇచ్చేది స్నేహమని ఆ దేవుడు మనకు ఇచ్చిన గొప్ప వరమని

అనుకున్నాను అదృష్టం తలుపు తట్టి వస్తుందని మనం మెలుకువలో ఉండి ఆహ్వానిస్తే  మన జీవితాన్నే మార్చేస్తుందని
అనుకోలేదు మన  గుండె తలుపును తీసి స్నేహాన్ని ఆహ్వానిస్తే  మన జీవితం ఆనందమయమని మంచి స్నేహితుడు  లబించడమే మనకు గొప్ప అదృష్టమని

అనుకున్నాను ఇన్ని ప్రత్యేకతలు ఉన్న ఆ స్నేహంతో స్నేహం చెయ్యాలని నా స్నేహం ఎవరితో అని
అనుకోలేదు నన్ను వరించిన అదృష్టం, నా బలం, ఆ దేవుని వరం,  నా ఆనందం, నా  స్నేహానికి ప్రతిరూపం దినువ్వే రా నా నేస్తం 
Written By,
Siva..

2 comments:

  1. anukoledhu inthati aanandhaaniki nenu arhudowthaanani... anukunnanu naku neevu epatiki snehame kakunda anni nevowthaavani...

    ReplyDelete
  2. This comment has been removed by the author.

    ReplyDelete