Hi, Welcome to Siva's Poetry, HAPPY NEW YEAR TO U ALL."LOVE THE WORK U DO AND DO THE WORK U LOVE". Thanks for Staying With Us.Have A Nice Day :)

Monday, February 6, 2012

ఓ మనిషి

ఆలోచనావిచక్షణ జ్ఞానం కలిగిన మనిషిగా ఈ భూమి మీద పుట్టావు
భయపెడితే భయపడతావు
ధైర్యం చెప్తే చీకోడతావు
ద్వేషిస్తే దూషిస్తావు
ప్రేమిస్తే పిచ్చంటావు
సహాయం చేస్తే స్వార్థం అంటావు
నిరాకరిస్తే నిరాశపడతావు
అనుమానిస్తే అవమానమంటావు
అభిమానిస్తే ఆలోచిస్తావు
తప్పుంటే తప్పుకోవు
ఒప్పంటే ఒప్పుకోవు
మంచి చేసిన వారిని మరిచిపోతావు
చెడు చేస్తున్నా వారిని చేరదీస్తావు
వాడుకోవలిసిన వస్తువులను ప్రేమిస్తావు
ప్రేమించాల్సిన మనుషులను వాడుకుంటావు
కుల్లిపోతున్న సమాజాన్ని మార్చడానికి ఎవరో రావాలని కోరుకుంటావు
ఆ సమాజంలో నువ్వు ఒకడివని తెలిసి కూడా నిన్ను నువ్వు మార్చుకోవు
ఓ మనిషి నీకు అన్నీ తెలిసి చేస్తున్నావా ఇవన్నీ అందరితో కలిసి...?

No comments:

Post a Comment