Hi, Welcome to Siva's Poetry, HAPPY NEW YEAR TO U ALL."LOVE THE WORK U DO AND DO THE WORK U LOVE". Thanks for Staying With Us.Have A Nice Day :)

Monday, November 28, 2011

నీ స్నేహం

అమ్మలా అనునిత్యం లాలించేతత్వం
ఆలనాపాలనను ఆనందంతో అనుసందానం చేసే గుణం
ఇంకోసారి పుడతాడు అస్తమించిన ఆ సూర్యుడు ఒక్కసారే పుడతాడు ఈ ఆత్మీయుడు
ఈ ప్రపంచంలో ఎక్కడున్నా అనుమతి లేకుండా మనసుకు చేరువవుతాడు
ఉడుతా భక్తికి ఆ శ్రీరాముని స్పర్శే నిదర్శనం నేను వేచిఉన్న నీ అనుగ్రహం కోసం
ఊపిరి ఉన్నంతవరకే ప్రాణం నువ్వు అను తోడు ఉన్నంతవరకు  జీవితం ఒక  పూలవనం
ఋతువులా వచ్చావు కొత్త ఆశలు నింపావు మదిలో ఒక తీపి గుర్తులా నిలిచావు
ఎవరైన ఎప్పు డైనా చవిచూసే ఒక తీపి అనుభవం అందరికి లబించే గొప్ప వరం అందుకు నువ్వే నిర్వచనం
ఏమని చెప్పను, ఎంతని చెప్పను నీ పై ఇష్టం అది మాటల్లో చెప్పలేనంత రాతల్లో రాయలేనంత
ఐక్యమత్యమే మహా బలం అనుమానం లేదు నువ్వే నా మనోబలం
ఒకటి రెండు మూడు వీటికి లెక్కలేదు నీతో ప్రయాణానికి ముగింపు రాదు
ఓడిపోతామని ఆపను ఏపనిని వీడిపోతామని  వదలను నీ చేయిని ఇప్పటికి ఎప్పటికి
ఔను నిజం నువ్వు ఉన్న సమయం యుగం ఒక క్షణం లేని తరుణం క్షణం ఒక యుగం
అంతంలేని ఈ అనుబందానికి రూపమే నువ్వు నీ స్నేహం

చిన్నతనంలో నేర్చిన ఓనామాలు నీస్నేహం నేర్పిన  అనురాగాలు ఎప్పటికి మరిచిపోను

Written By,
                                                                     Siva..