Hi, Welcome to Siva's Poetry, HAPPY NEW YEAR TO U ALL."LOVE THE WORK U DO AND DO THE WORK U LOVE". Thanks for Staying With Us.Have A Nice Day :)

Friday, April 30, 2010

I DONOT WANT TO MISS U MY DEAR FRIEND

జీవితం విలువైనది, పరిమితమైనది ఎంతోమందిని పరిచయం చేసింది
అందులో అనుకోకుండా లభించిన వరం కాపాడుకుంటాను అనుక్షణం ఎదగాలి అనుదినం కావాలి అనునిత్యం అదే నాకు నీ స్నేహం
నీ స్నేహంతో చూసాను కొత్త బంగారు లోకం  అయ్యావు నువ్వే నా ప్రపంచం 
నీతో పంచుకున్న ప్రతి అనుభవం చేసింది బాధను కుదింపు ఆనందాన్ని రేటింపు
కంటికి కనురెప్ప తోడు ఎవ్వరు విడదీయలేరు నేను నీకు తోడు ఎప్పటికి  వీడిపోను ఆ దైవం తోడు
గంగి గోవు పాలు గరిటెడు అయిన చాలు అన్నది ఆ వేమన పద్యం
నీతోటి స్నేహం ఎన్ని జన్మలకయినా చాలదు అన్నది నేను నమ్మిన సత్యం
వాడిన పువ్వు వికసించదు, గడిచిన కాలం తిరిగిరాదు ఇది అందరికి తెలిసిన  నిజం
కాని నువ్వు నాకు దూరమైనా  నీ నవ్వులే వికసించిన పువ్వులు ఎప్పటికి వాడిపోవు నీ జ్ఞాపకాలే  ఎప్పటికి గుర్తుంటాయి కలకాలం
అన్ని చోట్ల ఉన్న దేవుడు కనిపించడు వినిపించడు కాని మన జీవన ప్రయాణానికి  దారి చూపిస్తాడు
నా గుండెంతా  నిండిన నువ్వు ఎప్పటికయినా కనిపిస్తావని వినిపిస్తావని నిన్ను దరి చేరే దారి కోసం ఎదురు చూస్తూనే ఉంటాను
నింగి నేలను చేరలేదనే బాధను మేగం అయి కరిగి వర్షంగా మారి  భూమిని చేరి తెలుపుతుంది కదా
నిన్ను చేరాలని నా కంటి నుండి కారిన ప్రతి కన్నీరు ఆవిరి అయి నిన్ను చేరలేదా నేస్తమా
జీవితం లో  తోడునిలిచిన మిత్రమా ఎప్పటికి నీ తోడు కోరుతూ  ఇట్లు మన స్నేహం 


FRIEND(Few Relations In Earth Never Dies)

You are my FRIEND remembers you till my life ends..........

Written By,
Siva..